ఒక రోజు ఆ చేప రాలేదు. తోడేలు పిల్లలు ఎంతో చూసి చూసి వెళ్లిపోయాయి. రెండు రోజులకి చేప వచ్చింది. ఎక్కడికి వెళ్లవు అని ఆరా తీయగా .. ఏమి చెప్పను ఈ కొలనులో చేపలు పట్టబోతున్నారంట. మా పిల్లల్ని నేను దూరమవుతాను మేము అందరం బ్రతకడం కష్టమే! ఆ జాలరులు మమ్మల్ని రేపు పట్టుకెళ్లి పోతారు అని తల్లి తోడేలుతో ఏడుస్తూ చెప్పింది. ఇది విన్న తల్లి తోడేలు బాధతో ఉన్న చేపని ఓదార్చింది.ఆ రోజంతా చేప తోడేలు పిల్లల్తో ఎంతో ఆడుకుంది. మనసులో అంత బాధ పెట్టుకుని తన పిల్లల్తో సంతోషంగా ఎన్నో మాటలు చెబుతున్న ఆ చేపని, ఆ మాటలకి నవ్వుతున్న తన పిల్ల తోడేళ్ళని చూసి ఆడతోడేలు ఎదోలాగా చేపని రక్షించాలి అనుకుంది.
మరునాడు చేప రాలేదు. అయిదు రోజులకి తిరిగి వచ్చింది. తోడేలు పిల్లలు సంతోషించాయి. తల్లి తోడేలు అడిగింది " ఎక్కడ! జాలరులు వచ్చారా? అని. "రాలేదు.. అదే మేమంతా ఎందుకు రాలేదు వాళ్ళు అని అనుకుంటున్నాం." దానికి తల్లి తోడేలు చెప్పింది. "ఇంకా ఎప్పటికి రారు" అని . చేప సంతోషంతో " అవునా! ఎలా చెప్పగలరు. వాళ్ళు వస్తారు"అంది. దానికి తల్లి తోడేలు నీకు ప్రాణభయం ఉన్నట్లే జాలరులకి కూడా ప్రాణ భయం ఉంటుంది కదా అందుకే రారు " అంది. చేపకి అర్ధం కాలేదు. "కొంచెం అర్ధమయ్యేలా చెప్పండి" అంది.
అప్పుడు తల్లి తోడేలు ఇలా చెప్పింది. " నా పిల్లలు నువ్వు ఉంటె ఎంతో సంతోష పడతారు. అలంటి నువ్వు ఆపదలో ఉంటె నేను సహాయం చేయకుంటే ఎలా ! అందుకే మా వారితో చెప్పను. అయన మిత్రుడు సింహం మరియు పులి ఆ జాలరులు వచ్చే దారిలో ఆ రోజు వాళ్ళకి కనిపించి గట్టిగ గాండ్రించాయి. అంతే ఏ ఒక్కరు ఇక నుండి ఈ అడవి వైపు గాని, నువ్వు ఉండే ఈ కొలను వైపు గాని రారని మా వారు చెప్పారు. "
ఇది విన్న చేపకి తన పిల్లలు బ్రతికిపోయారని అలాగే కొలనులో ఉన్న చేపలన్నీ రక్షించబడ్డాయి అని తెలుసుకుని తల్లి తోడేలుకు కృతజ్ఞత చెప్పుకుంది. చేప పిల్లలు తోడేలు పిల్లలు ఆలా మంచి మిత్రులై ఎన్నో ఏళ్ళు సంతోషంగా బ్రతికాయి. మన చుట్టూ ఉన్నవాళ్ళకి మనం సహాయం చేయడం నేర్చుకోవాలి. అది చిన్నదైనా, పెద్దదైన!
0 Yorumlar